Asamtrupti
అడుగు అడుగునా అడుగుతున్నా
మది మడుగు అడుగునా ఉన్న మగువని నువ్వు ఎవ్వరని?
నా ప్రశ్న రాగం ఏదైనా తన జవాబు గీతం ఒకటే!
తన మౌనం ఎంతైనా, అది కొనడం నా ధ్యేయం
తను తనువు మరిచి ఆలపించెను,
ఆర్ద్ర నయనాలతో ఆర్తనాదం !
" నిశ్శబ్దం నేర్చుకో,
పట్టని ఈ జగం తో నిత్యం మాట్లాడడం లో ఏంటి అర్ధం?
వినమ్రత నీలో చేర్చుకో,
వినని ఈ జనం తో సత్యం కై పోట్లాడి వ్యర్ధం?
భక్తి ముసుగు కప్పుకో ,
భగవంతుడంటే భయమనుకునే వీళ్ళతో బతకాలి
వినయం కొంచెం ఉంచుకో,
నీ పొగరుని గర్వం అనుకునే ఈ జనం తో ఉండాలి
అబద్దం అరకిలో కొనుక్కో,
నిజం చెబితే నిలదీసే నికృష్టులతో నడవాలి
మోసం మూరెడు బేరమాడి తీసుకో,
నువ్వు మంచి తో సాయం చేస్తే నీ సంచి నే మాయం చేసే మనుషులతో మెలగాలి...
కుళ్ళు కళ్ళలో ఉంచుకో ,
లేకుంటే పక్కోడు పైకొస్తే చూసి ఏడ్చే ఈ ప్రజలు నిన్ను వెలి వేస్తారు
దురాశలు దాచుకో,
దూరపు కొండల నునుపు కై దేవులాడే ఈ దరిద్రులతో ఉండాలి "
తన పాట తెలిపింది నాకు
ఆ పాడే మగువ పేరు .....అసంతృప్తి!

2 Comments